ePaper
Friday, August 28, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బోడుప్పల్లో మైనింగ్ ఏడీ ఇంటి పై ఏసీబీ దాడులు.ఏకకాలంలో 8 ప్రాంతాల్లో తనిఖీలు,

బోడుప్పల్లో మైనింగ్ ఏడీ ఇంటి పై ఏసీబీ దాడులు.ఏకకాలంలో 8 ప్రాంతాల్లో తనిఖీలు,

📰 Generate e-Paper Clip

బోడుప్పల్లో మైనింగ్ ఏడీ ఇంటి పై ఏసీబీ దాడులు.ఏకకాలంలో 8 ప్రాంతాల్లో తనిఖీలు,

అర్జున్ సమాచారం ప్రతినిధి హైద్రాబాద్ ఆగస్టు 27.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో భూగర్భజలవనరుల శాఖకు చెందిన మైనింగ్ ఏడీ జయరాజు నివాసం పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్నగర్లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం జయరాజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మైనింగ్ ఏడీగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఆయన తన అధికారిక ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల పై ఏసీబీ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జయరాజుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు, ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను అధికారులు ఇప్పటి వరకు లభించినవి..

సోదాల్లో ఇప్పటివరకు రెండు కార్లు, రూ.1.50 లక్షల నగదు, రెండు పుస్తకాలు, జనగామ జిల్లాలోని 5 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లకు సంబంధించిన వివరాలు అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే సోదాలు ఇంకా పూర్తి కాకపోవడంతో మొత్తం ఆస్తుల విలువ, ఇతర కీలక పత్రాలు లేదా నగదు, బంగారం తదితర వివరాల పై స్పష్టత రావాల్సి ఉంది. సోదాలు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాలు, ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. సోదాలు కొనసాగుతుండటంతో పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

బోడుప్పల్లో మైనింగ్ ఏడీ ఇంటి పై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 8 ప్రాంతాల్లో తనిఖీలు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!