ePaper
Thursday, November 19, 2026
ePaper
Homeతెలంగాణకార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం....

కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం….

📰 Generate e-Paper Clip

కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం….

మంచిర్యాల:అర్జున్ సమాచారం నవంబర్ 19.

మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండు రోజుల నిరాహార దీక్షలు ప్రారంభం.
సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో స్థానిక మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షలు గురువారం రోజున ఘనంగా ప్రారంభమయ్యాయి.

బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్ సారథ్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో మొదటి రెండో రోజైన బుధవారం , గురువారం రోజున, మందమర్రి ఏరియా శాంతి ఖని మైన్ తరుపున బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పిట్ సెక్రటరీ రత్నం ప్రవీణ్ సారధ్యంలో పిట్ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేశ్ , సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి దండ వేసి నిరాహార దీక్షను ప్రారంభించారు.

సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోగా, సంస్థ ఆర్థిక పరిస్థితి కూడా తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి నుంచి బొగ్గు, విద్యుత్ తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను చెల్లించకుండా కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తోందని విమర్శించారు. మరోవైపు , సి ఎస్ ఆర్ డి ఎం ఎఫ్ టి నిధుల పేరుతో ప్రతి సంవత్సరం సింగరేణి నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని  పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ.26 వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని అన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలకు కారణమైందని విమర్శించారు. సింగరేణి సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టడం సరైన విధానం కాదని అన్నారు.

అదేవిధంగా కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఏఐటీయూసీ ప్రధాన డిమాండ్లు:

27-08-2026 ఒప్పందం ప్రకారం ప్రతి నెలా మెడికల్ బోర్డులు నిర్వహించాలి.
29-01-1981న ఏఐటీయూసీతో జరిగిన చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి అర్హత కలిగిన కార్మికుడికి మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేసి డిపెండెంట్ ఉద్యోగం కల్పించాలి.

తొమ్మిది నెలలుగా వీటిసి ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు 27-08-2026 ఒప్పందం ప్రకారం నెల రోజుల్లోనే ఆర్డర్లు జారీ చేయాలి.
సింగరేణికి రావాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఆర్ సి ఎల్ దగ్గర అగ్రిమేట్స్ చేసిన 24 డిమాండ్లను సర్కులర్ రిలీజ్ చేయాలీ, సొంతింటి పథకాన్ని వెంటనే ఇవ్వాలి,

అనంతరం కార్మిక హక్కుల సాధన కోసం, కార్మికుల ప్రాణాల పరిరక్షణ కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సాగించిన చారిత్రాత్మక పోరాటాలను నాయకులు వివరించారు. కార్మికుల హక్కుల కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమర నాయకుల పోరాట స్ఫూర్తిని గుర్తుచేస్తూ, వారి ఆశయాల సాధన కోసం ప్రతి కార్మికుడు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఏఐటీయూసీ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ రెండు రోజుల నిరాహార దీక్షలు కార్మికుల ఐక్యతకు, హక్కుల సాధనకు నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: శాంతి ఖని మైన్ అసిస్టెంట్ సెక్రటరీ దాడి రమేష్, ఎస్.కె. మైన్ ట్రెస్సరర్ ఒడ్నాల శ్రీకాంత్ , మైన్స్ కమిటీ సభ్యులు రాజ్కుమార్ , ఫకృద, రామకృష్ణ, అంజత్ ఖాన్, రామచందర్, మహంకాళి సంతోష్ కుమార్, జనార్ధన్, సాగర్, బాబా, మైన్స్ కమిటీ సభ్యులు, సేఫ్టీ కమిటీ సభ్యులు, షిఫ్ట్ ఇన్‌చార్జిలు, అసిస్టెంట్ షిఫ్ట్ ఇన్‌చార్జిలు, టెంపుల్, క్యాంటీన్ కమిటీ సభ్యులు, పిట్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!