నాలుగు దేశాల జీడీపీ కంటేఇండియన్ బిజినెస్ మ్యాన్ ఆదాయమే ఎక్కువ.
ముంబై, ఆగస్టు 25 అర్జున్ సమాచారం డెస్క్ ఆగస్టు 25,
భారత్‌లోని అత్యంత ధనిక కుటుంబాల జాబితా వెలువడింది. 2026 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూయబుల్ ఫ్యామిలీ బిజినెస్‌లో భారత కుబేరుల జాబితా విడుదలైంది. ఈ లిస్టులో మొదటి స్థానంలో అంబానీ కుటుంబం, రెండో స్థానంలో అదానీ కుటుంబం ఉన్నాయి.ఈ జాబితా ప్రకారం, భారత్2లోని టాప్ 10 ధనిక వ్యాపార కుటుంబాల మొత్తం సంపదను కలిపితే 70.5 లక్షల కోట్లు అవుతుంది. లిస్టులోని టాప్ 300 కుటుంబాల మొత్తం సంపద విలువ 138 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో ఒక్క అంబానీ కుటుంబం వద్దే 25.8 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. రెండో స్థానంలో గౌతమ్ అదానీ ఉన్నారు. వారి సంపద విలువ 19.6 లక్షల కోట్ల రూపాయలు. 138 లక్షల కోట్ల మొత్తాన్ని ఒక దేశ జీడీపీగా పరిగణిస్తే, అది ప్రపంచంలో 18వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఈ సంపద సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, పోలాండ్, నెదర్లాండ్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల మొత్తం జీడీపీ కంటే ఎక్కువ.2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ నామమాత్ర జీడీపీ 3.92 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు 328 లక్షల కోట్లు)గా ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ఏప్రిల్ 2026 ‘వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్’ నివేదిక ఆధారంగా ప్రభుత్వం 2026 ఆగస్టులో ఈ సమాచారం ఇచ్చింది. ఈ విలువతో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 138 లక్షల కోట్ల రూపాయల మొత్తం ద్వారా అనేక పెద్ద మైలురాళ్లను సాధించవచ్చు. ఈ భారీ మొత్తంతో ఒక్కో నగరానికి 30 వేల కోట్ల రూపాయల చొప్పున 100 కొత్త స్మార్ట్ సిటీస్ నిర్మించవచ్చు. వీటిలో 100 శాతం అండర్‌గ్రౌండ్ విద్యుత్- వాటర్ పైప్ లైన్లు, AI పవర్డ్ ట్రాఫిక్ కంట్రోల్, మోడ్రన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటాయి.
ఒక్కో ఆసుపత్రికి రూ. 500 కోట్ల ఖర్చుతో ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 5000 భారీ ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించవచ్చు.
ఒక్కో స్కూలుకు 20 కోట్ల రూపాయల ఖర్చుతో 50000 హైటెక్ పాఠశాలలు నిర్మించవచ్చు. అందులో అత్యుత్తమ అంతర్జాతీయ స్థాయి సైన్స్, రోబోటిక్స్ ల్యాబ్స్, డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్స్, పెద్ద ప్లేగ్రౌండ్లు వంటి అనేక సౌకర్యాలు కల్పించవచ్చు.
38 లక్షల కోట్ల రూపాయలతో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో 25000 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేలు వేయవచ్చు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు దేశంలోని ప్రతి ప్రధాన ఆర్థిక కేంద్రాన్ని కలుపుతుంది. దీని వల్ల లాజిస్టిక్స్ రెండింతల వేగంతో జరుగుతుంది.
ఈ మొత్తాన్ని భారత మొత్తం జనాభాలో (సుమారు 140 కోట్ల మంది) సమానంగా పంచితే, దేశంలో ప్రతి వ్యక్తి బ్యాంక్ ఖాతాలో 1 లక్ష రూపాయలు ఉంటాయి.
ముకేష్ అంబానీ ఇల్లు యాంటిలియా ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఈ డబ్బుతో యాంటిలియా వంటి 10000 లగ్జరీ ఇళ్లు నిర్మించవచ్చు.
ఈ భారీ మొత్తంతో 7000 రఫేల్ జెట్లు కొనుగోలు చేయవచ్చు.
ప్రపంచంలో అతిపెద్ద బంగారు నిల్వలు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వద్ద ఉండగా.. ఈ డబ్బుతో అంతర్జాతీయ మార్కెట్ నుంచి లక్షల కిలోల బంగారం కొనుగోలు చేయవచ్చు.
టాప్ 5 వ్యాపార కుటుంబాలు ఇవే..
హురున్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, భారత్‌లోని అత్యంత ధనిక వ్యాపార కుటుంబాల ప్రస్తుత ఆస్తుల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
ర్యాంక్ బిజినెస్ ఫ్యామిలీ నెట్వర్త కంపెనీ
1 అంబానీ కుటుంబం రూ. 25.8 లక్షల కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్
2 అదానీ కుటుంబం రూ. 19.6 లక్షల కోట్లు అదానీ గ్రూప్
3 సునీల్ భారతి మిట్టల్ రూ. 12.1 లక్షల కోట్లు భారతి ఎంటర్ప్రైజెస్
4 కుమార్ మంగళం బిర్లా రూ. 8.14 లక్షల కోట్లు ఆదిత్య బిర్లా గ్రూప్
5 జిందాల్ కుటుంబం రూ. 8.02 లక్షల కోట్లు ఓపీ జిందాల్ గ్రూప్
అదానీ కుటుంబం, సునీల్ భారతి మిట్టల్ కుటుంబం కాకుండా దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించిన మరికొంతమంది మొదటి తరం వ్యాపార కుటుంబాలు ఉన్నాయి. దిలీప్ సంఘ్వీ కుటుంబం- రూ.4.55 లక్షల కోట్ల ఆస్తితో సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ కుటుంబం మొదటి తరం ధనవంతుల్లో మూడో స్థానంలో నిలిచింది. పూనావాలా కుటుంబం- రూ.2.98 లక్షల కోట్ల ఆస్తి విలువతో సీరం ఇన్స్టిట్యూట్ పూనావాలా కుటుంబం కూడా జాబితాలో చోటు దక్కించుకుంది. రాధాకిషన్ దమానీ కుటుంబం- రూ.2.86 లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ ఈ జాబితాలో ఉన్నారు.

