ePaper
Tuesday, August 18, 2026
ePaper
HomeతెలంగాణGHMCజిల్లా కాంగ్రెస్‌లో కీలక పోస్టులకు నియామకాలు.. ఎల్లే రామ్మూర్తి ఉపాధ్యక్షుడు, రొడ్డ బాపన్న కార్యదర్శి

జిల్లా కాంగ్రెస్‌లో కీలక పోస్టులకు నియామకాలు.. ఎల్లే రామ్మూర్తి ఉపాధ్యక్షుడు, రొడ్డ బాపన్న కార్యదర్శి

📰 Generate e-Paper Clip

జిల్లా కాంగ్రెస్‌లో కీలక పోస్టులకు నియామకాలు.. ఎల్లే రామ్మూర్తి ఉపాధ్యక్షుడు, రొడ్డ బాపన్న కార్యదర్శి

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచారం, జూన్ 29

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో కీలక నియామకాలు చేపట్టినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ మేరకు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎల్లే రామ్మూర్తిని, జిల్లా కార్యదర్శిగా రొడ్డ బాపన్నను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లే రామ్మూర్తి, జిల్లా కార్యదర్శి రొడ్డ బాపన్న తమపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ నూతనంగా నియమితులైన ఇద్దరు నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వారు సమర్థవంతంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు.

నూతనంగా నియమితులైన నాయకులు మాట్లాడుతూ పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామగిరి మండల బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సదానందం, లద్నాపూర్ సర్పంచ్ వనం రామచంద్రరావు, మాజీ సర్పంచ్‌లు తీగల సమ్మయ్య, ఎరుకల బాపూరావు, ఐఎన్‌టీయూసీ నాయకుడు బెల్లం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు తీగల సదయ్య, ధర్మల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలు కనుకయ్య, భద్రయ్య, వేగోలపు మోహన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!