ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeతెలంగాణఆదివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి!సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

ఆదివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి!సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

📰 Generate e-Paper Clip

ఆదివారం బ్యాంకులు తెరిచే ఉంటాయి!సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

మంచిర్యాల:అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 26:

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతిపాదించిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.

వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు సెప్టెంబర్ 27, 2026 ఆదివారం నాడు ప్రభుత్వ రంగ బ్యాంకులు , ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సాధారణ పనిదినంలా పనిచేసేలా చర్యలు తీసుకుంది.

సెప్టెంబర్ 26 నాల్గవ శనివారం, సెప్టెంబర్ 27 ఆదివారం సాధారణ సెలవు దినాలు కాగా, ఆ వెంటనే సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో సమ్మె ఉండడం తో
ఖాతాదారులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సెప్టెంబర్ 27న బ్యాంకు శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు, ఏటీఎం అనుసంధానిత శాఖలను తెరిచి ఉంచేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!