ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeజగిత్యాలసమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్...

సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్.

📰 Generate e-Paper Clip

సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్.

జగిత్యాల ప్రతినిధి :అర్జున్ సమాచారం సెప్టెంబర్ 26::

  • క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన అదికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ గారు.

ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమిష్టి కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ తెలిపారు. జిల్లాలో 3500 పైగా గణేష్ మండపాల నుండి విగ్రహాలు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయబడ్డాయిని నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, ఆరోగ్యశాఖలు సిబ్బంది సహకారంతో సమన్వయంగా పనిచేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని ఎస్పీ గారు అన్నారు. గడిచిన 11 రోజులపాటు 24 గంటలు పని చేసిన పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని దీనికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు. అదేవిధంగా నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్స, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు సక్రమంగా విధులు నిర్వర్తించి తమ వంతు పాత్ర పూర్తి చేసినందుకు అభినందనలు తెలియజేశారు. జిల్లా ప్రజలు, మండపాల నిర్వాహకుల సహకారం వల్ల గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ సాఫీగా ముగిసిందని ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎస్పీ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోవు రోజుల్లో జరిగే పండుగలను ఇదే స్ఫూర్తితో జరుపుకోవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!