కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ:
భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, ఆగస్టు 7:
కొత్తపల్లి గ్రామానికి చెందిన యాసం శ్రీనివాస్ తన సేవాభావాన్ని మరోసారి చాటుకున్నారు. శుక్రవారం తన సొంత ఖర్చుతో ఎంపీపీఎస్ కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 45 భోజన ప్లేట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆయన కోటపల్లి మండలంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్లేట్లను అందజేసిన యాసం శ్రీనివాస్ మాట్లాడుతూ, “పిల్లలే దేశ భవిష్యత్తు. వారి విద్యాభివృద్ధికి, అవసరాలకు తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ఈ ప్లేట్లు విద్యార్థులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. శ్రీనివాస్, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ దుర్గం తిరుపతి, వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

