బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
అర్జున్ సమాచారం.సెప్టెంబర్ 26: ముత్తారం.రిపోర్టర్.
సీతంపల్లె గ్రామానికి చెందిన జక్కుల రాయమల్లు ఇటీవల మృతి చెందడంతో, ఆయన కుటుంబ సభ్యులను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జక్కుల ముత్తయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూరాకుల ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

