మంచిర్యాల వాసికి అంతర్జాతీయ గుర్తింపు: డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్‌కు వరల్డ్ రికార్డ్ అవార్డు.
అర్జున్ సమాచారం, మంచిర్యాల జిల్లా ప్రతి నిధి, ఆగస్టు 29:
సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందించినందుకు గానూ మంచిర్యాల జిల్లా, భీమారం మండలం, ఖాజీపల్లి గ్రామానికి చెందిన, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ ప్రతిష్టాత్మక ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ అవార్డును అందుకున్నారు.
తమిళనాడులోని హోసూర్ పట్టణంలో అమెరికన్ విస్డమ్ పీస్ యూనివర్సిటీ సీఈఓ డాక్టర్ ఎలిజబెత్ థామస్, ప్రొప్రైటర్ జాన్ విల్సన్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. సమాజ హితం కోసం, ముఖ్యంగా గొర్రెల-మేకల పెంపకందారుల సంక్షేమం మరియు సామాజిక సేవా కార్యక్రమాలలో ఆయన చేసిన కృషికి గానూ ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
తన సొంత గ్రామమైన ఖాజీపల్లి పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్‌ను స్థానికులు, సంఘం నాయకులు అభినందనలతో ముంచెత్తారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో గాలి మధు యాదవ్, అరుణ్ కుమార్, శ్రీరామ్ కరుణాకర్ స్వామి తో పాటు పలువురు ముఖ్య నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

