ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeతెలంగాణకార్మిక ఉద్యమంలో మరో మైలురాయి టీబీజీకేఎస్ కేంద్ర కమిటీలో ఈసంపల్లి రమేష్.

కార్మిక ఉద్యమంలో మరో మైలురాయి టీబీజీకేఎస్ కేంద్ర కమిటీలో ఈసంపల్లి రమేష్.

📰 Generate e-Paper Clip

కార్మిక ఉద్యమంలో మరో మైలురాయి టీబీజీకేఎస్ కేంద్ర కమిటీలో ఈసంపల్లి రమేష్.

అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 26. రామగిరి.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కేంద్ర కమిటీ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈసంపల్లి రమేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకుడు పర్లపల్లి రవీందర్ చేతుల మీదుగా రమేష్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

రామగిరిలోని స్థానిక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టీబీజీకేఎస్ వర్క్‌షాప్ అనంతరం వేదికపై ఈ నియామక పత్రాన్ని అందించారు. సింగరేణి సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఈసంపల్లి రమేష్ గతంలో బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా, రామగిరి మండల కమిటీలో కీలక బాధ్యతల్లో పనిచేశారు.

అలాగే టీబీజీకేఎస్‌లో పిట్ సెక్రటరీ, రెసిడెన్షియల్ కమిటీ సభ్యుడు, జీఎం కమిటీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన సేవలు, అనుభవాన్ని గుర్తించి కేంద్ర కమిటీలో సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించినట్లు సంఘం నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఈసంపల్లి రమేష్ మాట్లాడుతూ.. కేంద్ర కమిటీలో బాధ్యతలు అప్పగించడం తనపై సంఘం ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు సంఘం బలోపేతానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. తన ఎదుగుదలకు సహకరించిన కార్మిక సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు.

తనకు ఈ బాధ్యతలు అప్పగించిన మాజీ మంత్రి కోప్పుల ఈశ్వర్, పుట్ట మధుకర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, నాయకుడు నాగేల్లి సాంబయ్యతో పాటు సహకరించిన సంఘ నాయకులు, కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!