ePaper
Friday, October 2, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్భారత పైలట్ స్మిత్ మచ్చర్ కుటుంబానికి మోదీ ఫోన్..అండగా ఉంటామని ప్రధాని భరోసా.

భారత పైలట్ స్మిత్ మచ్చర్ కుటుంబానికి మోదీ ఫోన్..అండగా ఉంటామని ప్రధాని భరోసా.

📰 Generate e-Paper Clip

భారత పైలట్ స్మిత్ మచ్చర్ కుటుంబానికి మోదీ ఫోన్..అండగా ఉంటామని ప్రధాని భరోసా.
 
అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 1.

దుబాయ్ విమానంలో భారత పైలట్‌పై సహ పైలట్ కత్తితో దాడి
తీవ్ర గాయాలతోనూ 174 మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్
స్మిత్ ధైర్యాన్ని కొనియాడి, పూర్తి సహాయం అందిస్తామని హామీ
ఫ్లైదుబాయ్ విమానంలో సహ పైలట్ చేతిలో కత్తి దాడికి గురై, తీవ్ర గాయాలతోనూ ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ కుటుంబంతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. స్మిత్ చూపిన అసామాన్య ధైర్య సాహసాలను ప్రధాని కొనియాడారు. నిన్న‌ దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా.. కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైనప్పటికీ, స్మిత్ ధైర్యం కోల్పోకుండా కాక్‌పిట్ డోర్‌ను తెరిచారు. దీంతో ప్రయాణికులు వెంటనే స్పందించి, లోపలికి ప్రవేశించి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్మిత్ సమయస్ఫూర్తి వల్ల విమానంలోని 174 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రధాని మోదీ నేరుగా స్మిత్ భార్య, తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. గాయపడిన పైలట్‌కు భారత రాయబార కార్యాలయాల ద్వారా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే, సహ పైలట్ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!