ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణకులవివక్షకు తావిస్తే కఠిన చర్యలుపౌర హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: తహసిల్దార్ ముస్త్యాల వాసంతి

కులవివక్షకు తావిస్తే కఠిన చర్యలుపౌర హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: తహసిల్దార్ ముస్త్యాల వాసంతి

📰 Generate e-Paper Clip

కులవివక్షకు తావిస్తే కఠిన చర్యలు
పౌర హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి: తహసిల్దార్ ముస్త్యాల వాసంతి

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 30

గ్రామాల్లో కులవివక్షకు తావిస్తే కఠిన చర్యలు తప్పవని కమాన్‌పూర్ తహసిల్దార్ ముస్త్యాల వాసంతి హెచ్చరించారు. గురువారం కమాన్‌పూర్ మండలం పేరపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ ముస్త్యాల వాసంతి మాట్లాడుతూ పౌర హక్కులు, సంబంధిత చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలని అన్నారు. సమాజంలో కుల, మత భేదాలు లేకుండా అందరూ సమానత్వంతో మెలిగి తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. ఆలయాల్లో దళితుల ప్రవేశాన్ని అడ్డుకుంటే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుల వివక్షను పూర్తిగా విడనాడి గ్రామాల్లో సామరస్య వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్రవంతి, ఏఎస్ఐ బాలాజీ నాయక్, గ్రామ పంచాయతీ అధికారి అశోక్, గ్రామ సర్పంచ్ బొంగోని సదయ్య, ఉప సర్పంచ్ ఎరుకల పల్లవి, వార్డు సభ్యులు భోగే రవితేజ, మాటూరి నరేష్, రావుల స్రవంతి, పోలుదాసరి రజిత, ఆకుల సరిత, గుర్రాల కృష్ణస్వామి, జంగాపల్లి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!