నిరక్షరాస్యతను రూపుమాపేందుకే ఉల్లాస్ పరీక్షలు.
అర్జున్ సమాచారం సెప్టెంబర్ 27 కమాన్ పూర్ . డెస్క్.
నిరక్షరాస్యతను రూపుమాపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఉల్లాస్ పరీక్షలను నిర్వహిస్తోందని ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, ఏపీఎం పద్మ తెలిపారు.
ఆదివారం కమాన్‌పూర్ మండలంలోని గుండారం, జూలపల్లి, పేరాపల్లి, రొంపికుంట, పెంచికలపేట, నాగారం, సిద్ధిపల్లె, గొల్లపల్లి, కమాన్‌పూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా సంఘాల సభ్యులకు ఉల్లాస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 2,074 మంది మహిళలు హాజరయ్యారు. మండలంలోని 23 గ్రామ సంఘాలకు చెందిన మహిళలు పరీక్షలు రాశారు.
ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ఐదో తరగతి స్థాయి విద్యను పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించిన మహిళలకు భవిష్యత్తులో ఓపెన్ స్కూల్ ద్వారా తదుపరి విద్యను అభ్యసించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోందని వారు తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా విద్యలో రాణించి, ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకుని ఉద్యోగాలు సాధించాలని ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు రంగు సత్యనారాయణ గౌడ్, జంగిలి పోచాలు, పోల్ దాసరి వనిత-సాయికుమార్, పల్లె మాధవి-నారాయణ, బొంగొని సదయ్య గౌడ్, పొన్నగంటి కుమార్, బంగారు కళ్యాణి, షీలారపు మల్లయ్య-గుమ్మడి శ్రీనివాస్, ఐకేపీ సిబ్బంది సీసీలు బిక్షపతి, మల్లయ్యతో పాటు గ్రామైక్య సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

