ePaper
Sunday, September 27, 2026
ePaper
Homeతెలంగాణఉత్సాహంగా మహిళా సంఘాలకు ఉల్లాస్ పరీక్షలు.

ఉత్సాహంగా మహిళా సంఘాలకు ఉల్లాస్ పరీక్షలు.

📰 Generate e-Paper Clip

ఉత్సాహంగా మహిళా సంఘాలకు ఉల్లాస్ పరీక్షలు.

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 27 | ముత్తారం రిపోర్టర్.

ముత్తారం మండలంలోని పారుపల్లి, జిల్లెల్లపల్లి గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ‘ఉల్లాస్’ పరీక్షలను శనివారం ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు అక్షరజ్ఞానంతో పాటు సర్వతోముఖ అభివృద్ధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌లు చొప్పరి సంపత్, గడ్డం రాజేశం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ‘ఉల్లాస్’ పరీక్షలు రాయడం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరుగుతాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహిళా సంఘాల ద్వారా లభించే బ్యాంకు రుణాలు, ఆర్థిక ప్రణాళికలపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలు మరింత బలోపేతం కావడంతో పాటు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వేర్వేరుగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సీసీ తిరుపతి, గ్రామ వీఓఏ ఏనుగురి పద్మ, సీఏ సుమలత, మహిళా సంఘాల అధ్యక్షులు బోడ సంధ్య, పేట రజిత, కార్యదర్శి కోడం కల్పన, కోశాధికారి చీకటి రుచిత, ఉప సర్పంచ్ బోడ శ్యామలతో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!