ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeఆరోగ్యంఆరోగ్యమే అసలైన ఆస్తి.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి! అర్జున్ సమాచారం ఎడిటర్ లింగం రాజయ్య పిలుపు..

ఆరోగ్యమే అసలైన ఆస్తి.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి! అర్జున్ సమాచారం ఎడిటర్ లింగం రాజయ్య పిలుపు..

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం,జులై 11,మంచిర్యాల:
మంచిర్యాల: ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని అర్జున్ సమాచారం ఎడిటర్ లింగం రాజయ్య పిలుపునిచ్చారు. మారుతున్న జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడంతో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిరోజూ కనీసం అరగంట పాటు నడక, యోగా, పరుగు, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా శరీరానికి చురుకుదనం లభించడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందని తెలిపారు. వ్యాయామం రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, టెలివిజన్‌ల ముందు ఎక్కువ సమయం గడపకుండా శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
“ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది.. సమాజం అభివృద్ధి చెందుతుంది” అని పేర్కొంటూ, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని లింగం రాజయ్య విజ్ఞప్తి చేశారు.                                                                                                                   ===========================
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!