అర్జున్ సమాచారం:
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ విమాన టికెట్లతో జెడ్డా వెళ్లేందుకు ప్రయత్నించిన దంపతులను అధికారులు పట్టుకున్నారు. ఖతార్ ఎయిర్‌లైన్స్ విమాన టికెట్లను అధికారులకు చూపించగా, అవి నకిలీవని ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. విచారణలో, ఒక ఏజెంట్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసినట్లు దంపతులు తెలిపారు. విదేశాలకు పంపిస్తామని చెప్పి ఏజెంట్ వారిని మోసం చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
============================

