ePaper
Monday, November 23, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్న్యాయ దిగ్గజం రామ్ జెఠ్మలానీ విగ్రహావిష్కరణ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వర్చువల్...

న్యాయ దిగ్గజం రామ్ జెఠ్మలానీ విగ్రహావిష్కరణ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వర్చువల్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల విశిష్ట భాగస్వామ్యం.
భారత న్యాయరంగంలో తన అసాధారణ ప్రతిభ, న్యాయపరిజ్ఞానం, వాదనా పటిమతో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర మంత్రి, భారత బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ దివంగత రామ్ జెఠ్మలానీకి కరీంనగర్‌లో ఘన నివాళి అర్పించారు. ఆయన న్యాయరంగానికి అందించిన అమూల్యమైన సేవలకు గుర్తుగా కరీంనగర్‌లోని జస్టిస్ కుమారయ్య కాలేజ్ ఆఫ్ లా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని శనివారం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నరసింహ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పుల్లిచెర్ల సామ్ కోషి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ పాల్గొన్నారు. రామ్ జెఠ్మలానీ కుమారుడు, రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు స్వామినాథన్ గురుమూర్తి తదితర ప్రముఖుల హాజరుతో కార్యక్రమం విశిష్టతను సంతరించుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం, తెలంగాణ హైకోర్టుకు చెందిన ఉన్నత న్యాయమూర్తులు ఒకే వేదికపై భాగస్వాములు కావడం ఈ వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకువచ్చింది. న్యాయవాద వృత్తిలో అసాధారణ ప్రతిభ కనబరిచిన రామ్ జెఠ్మలానీ తన సుదీర్ఘ ప్రస్థానంలో దేశవ్యాప్తంగా అనేక సంచలనాత్మక, కీలక న్యాయపరమైన కేసుల్లో వాదనలు వినిపించారు. న్యాయవాదిగా మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధిగా, కేంద్ర మంత్రిగా, భారత బార్ కౌన్సిల్ చైర్మన్‌గా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ దేశానికి విశేష సేవలందించారు. న్యాయం పట్ల ఆయనకున్న నిబద్ధత, నిర్భయమైన వైఖరి, రాజ్యాంగ విలువల పట్ల గౌరవం, న్యాయవాద వృత్తిలో చూపిన అంకితభావం భారత న్యాయరంగ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును పొందాయి. అటువంటి న్యాయరంగ మహనీయుడి విగ్రహాన్ని న్యాయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా వర్చువల్‌గా ఆవిష్కరించడం కరీంనగర్ న్యాయ విద్యారంగానికి గర్వకారణం.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!