ePaper
Wednesday, October 7, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్బ్యాంక్ అధికారులమంటూ సైబర్ మోసాలు.. నిందితుడి అరెస్ట్ క్రెడిట్ కార్డు వివరాలు, OTPలు...

బ్యాంక్ అధికారులమంటూ సైబర్ మోసాలు.. నిందితుడి అరెస్ట్ క్రెడిట్ కార్డు వివరాలు, OTPలు ఆదిలాబాద్ బాధితుని వద్ద రూ.73,279 మోసం మహారాష్ట్ర గోవా తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు 150 ఫిర్యాదులు నమోదు. మూడు రాష్ట్రాల బాధితుల వద్ద 95 లక్షల వరకు మోసం మహారాష్ట్రలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు నిందితుడి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్,అర్జున్ సమాచారం:
నిందితుడి వివరాలు
చైతన్య ప్రమోద్ కుటె (25), S/o ప్రమోద్ కుటె, డబ్కి రోడ్డు, గురుకృప ప్రొవిజన్ సమీపంలో, మెహరేనగర్, భూరడ్ పోస్ట్, అకోలా గ్రామీణ, అకోలా జిల్లా, మహారాష్ట్ర. (ప్రస్తుతం పింప్రి-చించ్వాడ్, పూణే, మహారాష్ట్ర.)

బ్యాంక్ అధికారులమంటూ ప్రజలకు ఫోన్ చేసి, వారి క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాలు మరియు OTPలు సేకరించి డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరస్థుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ పత్రిక సమావేశంలో వివరాలను వెల్లడించారు..

ఆదిలాబాద్ బ్రాహ్మణవాడకు చెందిన బాధితుడు ప్రఫుల్ పాటిల్కు 2026 జూలై నెలలో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, అతని క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేస్తామని నమ్మించి సైబర్ మోసానికి పాల్పడి రూ.73,279/- కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో Crime No.633/2026 నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో భాగంగా NCRP పోర్టల్ ద్వారా లభించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. పై అధికారుల ఆదేశాల మేరకు  ఆదిలాబాద్ 1 టౌన్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం మహారాష్ట్రకు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆదిలాబాద్‌కు తీసుకువచ్చింది.

పోలీసుల విచారణలో నిందితుడు తాను గతంలో Axis బ్యాంక్‌లో పనిచేసిన సమయంలో కస్టమర్లతో మాట్లాడిన అనుభవాన్ని ఉపయోగించుకుని, బ్యాంక్ కస్టమర్లకు సంబంధించిన మొబైల్ నంబర్లను సేకరించినట్లు తెలిపాడు. అనంతరం వివిధ సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ బ్యాంక్ అధికారులమంటూ కస్టమర్లకు ఫోన్ చేసి, వారి క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు OTPలను తెలుసుకుని డబ్బులను వివిధ UPI, Amazon ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు తెలిపాడు.

నిందితడు తెలంగాణ, మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలలో దాదాపు 150 మంది బాధితుల వద్ద రూ 95,33,651/- నగదు నష్టపోయినట్లు జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ నందు ఫిర్యాదులను నమోదు అయినట్లు తెలిపారు.

అదేవిధంగా 23.07.2026న బాధితుడికి HDFC బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి, క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో నమ్మించి, OTPలను తెలుసుకుని ఐదు లావాదేవీల ద్వారా మొత్తం రూ.73,279/- బదిలీ చేసుకున్నట్లు విచారణలో తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడు మోసాలకు ఉపయోగించినట్లు తెలిపిన మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు కూడా విచారణలో వెల్లడించాడు. అలాగే వివిధ మొబైల్ నంబర్లతో సిమ్ కార్డులు మార్చుతూ, మొబైల్ ఫోన్లు మార్చుతూ సైబర్ మోసాలకు పాల్పడినట్లు తెలిపాడు.
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!