వికలాంగుల పెన్షన్ తొలగింపుపై ఆత్మహత్య ప్రయత్నం…
అర్జున్ సమాచారం ,ముత్తారం, సెప్టెంబర్ 16:
ఎంపీడీఓ కార్యాలయంపైకి ఎక్కి నిరసన
ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని రామకృష్ణపూర్ (ఇప్పలపల్లి) గ్రామానికి చెందిన సూరం రాజబాపు, పెదపల్లి సత్తయ్య అనే ఇద్దరి వికలాంగుల పెన్షన్లు తొలగించడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఎంపీడీఓ కార్యాలయంపైకి ఎక్కి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. పెన్షన్లు పునరుద్ధరించాలని కోరుతూ వారు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

