కరీంనగర్, అర్జున్ సమాచారం:
సైబర్ మోసాలకు వినియోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు చేపట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దర్యాప్తులో ఉన్న సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి నమోదైన వివరాలను సీపీ గౌష్ ఆలం వెల్లడించారు.
జిల్లాలోని మొత్తం 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు 29 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, వీటిలో మొత్తం 122 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో 89 మందికి సంబంధించి అరెస్ట్‌లు లేదా చట్టపరమైన నోటీసులు జారీ చేయడం పూర్తి కాగా, మిగిలిన 33 మంది నిందితుల అరెస్ట్ ప్రక్రియ పెండింగ్‌లో ఉందని సీపీ తెలిపారు.
పోలీస్ స్టేషన్ల వారీగా వివరాలు:
కరీంనగర్ 1 టౌన్: 6 కేసులు, 20 మంది నిందితులు 13 మందిపై చర్యలు, 7 పెండింగ్,
కరీంనగర్ 2 టౌన్: 5 కేసులు, 26 మంది నిందితులు 16 మందిపై చర్యలు,10 పెండింగ్,
కరీంనగర్ 3 టౌన్: 2 కేసులు, 12 మంది నిందితులు 10 మందిపై చర్యలు, 2 పెండింగ్,
కరీంనగర్ రూరల్: 1 కేసు, 6 నిందితులు, 1 పై చర్యలు, 5నిందితులు అరెస్ట్ పెండింగ్
జమ్మికుంట టౌన్: 3 కేసులు, 15 మంది నిందితులు 11 మందిపై చర్యలు, 4 పెండింగ్,
హుజూరాబాద్ టౌన్: 2 కేసులు, 10 మంది నిందితులు 9 మందిపై చర్యలు, 1 పెండింగ్,
కొత్తపల్లి: 2 కేసులు, 5 గురు నిందితులు అందరిపై చర్యలు పూర్తి.
మానకొండూరు: 2 కేసులు,3 నిందితులు 1 చర్యలు పూర్తి, 2 పెండింగ్,
చొప్పదండి: 1 కేసు,5 నిందితులు అందరిపై చర్యలు పూర్తి.
ఇల్లందకుంట: 1 కేసు, 5 నిందితులు అందరిపై చర్యలు పూర్తి)l,
గంగాధర: 1 కేసు,6 నిందితులు అందరిపై చర్యలు పూర్తి,
ఎల్.ఎం.డి. కాలనీ: 1 కేసు, 7 గురు నిందితులు 6 గురు పై చర్యలు, 1 పెండింగ్,
సైదాపూర్: 1 కేసు,1 నిందితుడు చర్యలు పూర్తి.
వీణవంక: 1 కేసు,1 నిందితుడు అరెస్ట్ పెండింగ్,
కేశవపట్నం-రామడుగు: ఎటువంటి కేసులు నమోదు కాలేదు.
పోలీసుల హెచ్చరిక:
తమ బ్యాంక్ ఖాతాలను, ఏటీఎం కార్డులను, లేదా ఓటీపీలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం గానీ, కమీషన్ల ఆశ చూపి చేసే లావాదేవీలకు వినియోగించడానికి ఇవ్వడం గానీ నేరమని పోలీసులు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లకు సహకరించే ఖాతాదారులను కూడా చట్టపరంగా నేరంలో భాగస్వాములుగానే పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

