ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లి10వ రోజుకు చేరిన అధికారుల రిలే నిరాహార దీక్షలు

10వ రోజుకు చేరిన అధికారుల రిలే నిరాహార దీక్షలు

📰 Generate e-Paper Clip

కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
సింగరేణి సంస్థ రామగిరి మండలంసెంటినరీ  కాలనీలోని
బుధవారం అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధనకై సిఎంఓఏఐ ఆర్జీ-3& ఏపీఎ   పరిధిలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారంనాటికి అధికారుల రిలే నిరాహార దీక్షలు విజయవంతంగా 10వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 8:25 గంటల నుంచే ఆర్జీ-3& ఏపీఏ జీఎం ఆఫీస్ ఎదురుగా అధికారులు ఈ దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రధానంగా అధికారుల జీతాల అప్డేషన్(పే -అప్గ్రేడేషన్) ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, అలాగే జీతంలో భాగమైన పెర్ఫార్మెన్  రిలేటెడ్ పే (పీఆర్పీ) చెల్లింపులను ఆలస్యం చేయకుండా, తదితర అధికారుల న్యాయమైన డిమాండ్లను  వెంటనే  పరిష్కరించాలనే  ముఖ్య ఉద్దేశంతో ఈ దీక్షను నిర్వహించారు.

ఈ రోజు జరిగిన రిలే నిరాహార దీక్షలో సీఎంవోఏఐ అర్జీ 3 & ఏపీఎ అధికారులు కూర్చుని తమ నిరసనను వ్యక్తం చేశారు:-

దీక్షలో పాల్గొన్న సింగరేణి అధికారులు
సిహెచ్. బాలరాజు, సూపరింటెండిoగ్ ఇంజినీర్ (ఈ& ఎం), ఏఎల్పి ఏపిఏ.
షేక్ కాలేషా, అడిషనల్ మేనేజర్ ఓ.సి.పి-2
సందుమల్ల ఉపేందర్ సూపరింటెండిoగ్ ఇంజినీర్(ఈ & ఏం), ఓసిపి-2.
ఎల్ . రవి చంద్ర. సీనియర్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్  డిపార్ట్మెంట్ జిఎంఓ   దొండేటి  రఘుకుమార్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈ& ఎం), ఓసిఎం-1. పిప్పారం రవీందర్, సర్వే ఆఫీసర్, ఓసిఎం-1.
విజయ కుమార్ సోనీ, సీనియర్ అండర్ మేనేజర్, ఏ ఎల్ పి డి ఏపీఏ
డోన్గ్రీ. అజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈ& ఎం),  ఏ.ఎల్పి  ఏ.పి.ఏ
– కంటే. శ్యామ్ సన్,సీనియర్ అండర్ మేనేజర్, ఏ ఎల్ పి డి ఏపీఏ             – ఆడెపు ఫనింద్ర సాయి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్), జిఎంఓ అర్జీ-3. ఉన్నారు.

సీఎంవోఏఐ అర్జీ 3 & ఏపీఎ అధ్యక్షులు కోల శ్రీనివాస్, సెక్రటరీ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అధికారుల దీర్ఘకాలిక సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని, పీఆర్పీ ని చెల్లింపులను జాప్యం లేకుండా, వెంటనే  విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో,, కె .నాగేశ్వరరావు ,  జిఎం ఏపీఏ,  ఏ . ఉదయభాస్కర్, ఏరియా ఇంజినీర్ అర్జీ 3, శ్రీ ధూ ధూప్ సింగ్ ఏరియా ఇంజినీర్ ఏపి ఏ, రాజేంద్రకుమార్  డీజీఎం సివిల్ మరియు ఏరియాకు చెందిన పలువురు సింగరేణి అధికారులు  అధిక సంఖ్యలో పాల్గొని తమ మద్దతును తెలిపారు…..
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!