ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్గుంటూరు జిల్లా వ్యాప్తంగా 'ఓపెన్ డ్రింకింగ్' పై ప్రత్యేక తనిఖీలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ‘ఓపెన్ డ్రింకింగ్’ పై ప్రత్యేక తనిఖీలు

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ‘ఓపెన్ డ్రింకింగ్’ పై ప్రత్యేక తనిఖీలు

గుంటూరు. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 20 .

జిల్లా పోలీసు లు నిన్న రాత్రి 7గంటల నుండీ 10 గంటల వరకు గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించి 21ఎఫ్ ఐ ఆర్ లు,109 పెట్టి కేసులు పలువురిపై  నమోదు చేసినారు.

 గుంటూరు జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు బహిరంగ ప్రదేశాల్లో మందుబాబుల వేధింపుల నుంచి మహిళలు, సాధారణ పౌరులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘ఓపెన్ డ్రింకింగ్’  పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
🔸జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ముఖ్యమైన కూడళ్లు, వైన్ షాపుల సమీప ప్రాంగణాలు, ఖాళీ స్థలాలు, పార్కులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు మరియు నిర్మానుష్య రహదారులలో తనిఖీలు చేపట్టారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని, సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.
  కౌన్సెలింగ్: బహిరంగంగా మద్యం సేవించడం నేరమని, దీనివల్ల సమాజంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!