తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం కోటపల్లి మండల కమిటీ ఏకగ్రీవంకోటపల్లి వార్డ్స్ మెంబర్స్ ఫోరం కోటపల్లి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 29
తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నాగబెల్లి జ్యోతి మంచిర్యాల జిల్లా ఇన్‌చార్జ్ ముక్త సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు, చెన్నూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సల్పల విష్ణువర్ధన్ యాదవ్ కొటపల్లి మండల ఇన్చార్జి పర్వతాలు ఆధ్వర్యంలో కోటపల్లి మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు
ఈ సందర్భంగా కోటపల్లి మండల అధ్యక్షుడిగా ఇందూరి మహేష్, ఉపాధ్యక్షులుగా కొట్రంగి మల్లేష్, ఎర్రినాగుల మురళి, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్, కార్యదర్శిగా కొండు రాజేష్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు ఫోరం నాయకులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గ్రామస్థాయి వార్డ్ మెంబర్ల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం మరింత బలోపేతంగా పనిచేయాలని ఆకాంక్షించారు
మండలంలోని వార్డ్ మెంబర్లందరినీ ఐక్యంగా తీసుకెళ్తూ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. వార్డ్ మెంబర్ల సంక్షేమం, హక్కుల సాధన కోసం కోటపల్లి మండల కమిటీ సమిష్టిగా పనిచేస్తూ ఫోరం అభివృద్ధికి తోడ్పడాలని నాయకులు ఆకాంక్షించారు.

