న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
సోమవారం పోలీస్‌స్టేషన్‌లో తన పీఆర్ఓ మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. “తెలంగాణ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన కేసీఆర్ గారి ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిని అడ్డుకునేందుకు మేము వెళ్తే పోలీస్‌స్టేషన్‌లో పెట్టి మాపై కూడా దాడికి ప్రయత్నించారు. నిన్న మళ్లీ పోలీస్‌స్టేషన్‌లోనే నా పీఆర్ఓ, పీఏపై 15 మందితో దాడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు గుండాలా? పోలీసులా? అనేది తేలాలి. మా వారిపై జరిగిన దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదు. తెలంగాణలో పోలీస్ శాఖ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తోంది. ఈ అంశంపై కోర్టులను ఆశ్రయిస్తాం. కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వం నిరాశ, నిస్పృహల్లో ఉంది. వెయ్యి రోజుల తర్వాత మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ప్రతిరోజూ అటెన్షన్ డైవర్షన్‌కు పాల్పడుతోందని ఆరోపించారు.
=============================

