మధ్యాహ్న భోజన కార్మికుల కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలి:BRS పార్టీ డిమాండ్.
మంచిర్యాల:కోటపెల్లి అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 16.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న భోజన వంట కార్మికుల పట్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.గత కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన మెటీరియల్ బిల్లులు, గుడ్ల బిల్లులు మరియు వంట కార్మికులకు ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు విడుదల చేయకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. పసిపిల్లలు ఆకలితో అలమటించకూడదన్న మానవతా దృక్పథంతో కార్మికులు బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ వండిపెడుతున్నారు.నిత్యావసర సరుకులు, నూనె, కూరగాయలు, గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, బిల్లులు ఇవ్వకుండా వారిని అప్పులపాలు చేయడం ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని BRS పార్టీ ప్రశ్నిస్తోంది.BRS పార్టీ ప్రధాన డిమాండ్లు:పెండింగ్ బిల్లుల విడుదల: కోటపెల్లి మండలంలోని అన్ని పాఠశాలల మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులను వెంటనే వడ్డీతో సహా విడుదల చేయాలి.బకాయి వేతనాలు: వంట కార్మికులకు రావాల్సిన నెలల తరబడి గౌరవ వేతనాల బకాయిలను తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలి.గ్రీన్ ఛానెల్ అమలు: ప్రతి నెలా 5వ తేదీ లోపు బిల్లులు, వేతనాలు నేరుగా అందేలా ‘గ్రీన్ ఛానెల్’ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి.వంట ఖర్చుల పెంపు: ప్రస్తుత ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెనూ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులను పెంచాలి.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కోటపెల్లి మండల మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించకపోతే, BRS పార్టీ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ కార్యాలయం (MEO) ఎదుట కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాము ,

