ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణటేకుమట్ల వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చర్యలు.

టేకుమట్ల వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చర్యలు.

📰 Generate e-Paper Clip

టేకుమట్ల వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చర్యలు.

అర్జున్ సమాచారం జులై 31 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:

జైపూర్: మండలం టేకుమట్ల వాగులో వరద ప్రవాహం పెరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న వెంటనే మంత్రి టేకుమట్ల వాగు వద్దకు చేరుకొని పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వాగుపై వంతెనల నిర్మాణానికి రూ.11.6 కోట్ల నిధులతో మూడు వంతెనలకు పరిపాలనా ఆమోదం లభించిందని తెలిపారు. నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమై ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యపై తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి టేకుమట్ల గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగేలా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని గ్రామస్థులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!