చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 29
సుల్తానాబాద్ మండలంలోని మార్కండేయ కాలనీలో ఉన్న చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు గోడ దూకి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపింది. చిల్డ్రన్ హోమ్ సూపరింటెండెంట్ వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం, మిరియాల ఉమామహేశ్వరి (16), సుశీల ఆకృతి (8) మంగళవారం రాత్రి సమయంలో చిల్డ్రన్ హోమ్ ప్రాంగణంలోని గోడ దూకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి వారి ఆచూకీ తెలియరాలేదు.
ఈ ఇద్దరు బాలికల గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే వెంటనే సుల్తానాబాద్ ఎస్ఐ 8712656511 లేదా సుల్తానాబాద్ సీఐ 8712656510 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

