ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణవాలీబాల్‌ పోటీలతో విద్యార్థుల్లో ఉత్సాహం.

వాలీబాల్‌ పోటీలతో విద్యార్థుల్లో ఉత్సాహం.

📰 Generate e-Paper Clip

వాలీబాల్‌ పోటీలతో విద్యార్థుల్లో ఉత్సాహం.

అర్జున్ సమాచారం.జులై 13. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా:

మంచిర్యాల: క్రీడలు విద్యార్థుల్లో శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ,
పట్టుదలను పెంపొందిస్తాయని మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ధరణి మధుకర్‌, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి అన్నారు. గురువారం మంచిర్యాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్‌ పోటీలను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ మంచిర్యాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ శిక్షణ కేంద్రంలో వాలీబాల్‌ పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. జిల్లాలోని సుమారు ఎనిమిది పారిశ్రామిక శిక్షణ సంస్థలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటాలని సూచించారు.
ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ శిక్షణ కేంద్రంలో నెలకొన్న సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు ఇతర సమస్యలను మేయర్‌ ధరణి మధుకర్‌ సహకారంతో మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్‌సాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని గడియారం శ్రీహరి తెలిపారు.
పోటీల్లో జన్నారం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్‌ రమేష్‌, వరంగల్‌ ప్రిన్సిపాల్‌ రమేష్‌, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్‌కుమార్‌, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యదర్శి సుధాకర్‌, టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, సహాయ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్‌కుమార్‌, కార్యవర్గ సభ్యురాలు సాహితి, పారిశ్రామిక శిక్షణ సంస్థ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!