ePaper
Wednesday, September 16, 2026
ePaper
Homeతెలంగాణతాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం....

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. అగా ఖాన్ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉందని అన్నారు.

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
మా వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.

అగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే మా శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నాం.

అగా ఖాన్ ఫౌండేషన్ కుతుబ్ షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించింది.

మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని కోరుతున్నాం.

ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం.

ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం.

మూసీ నదిని నైట్ ఎకానమీ కోసం తీర్చిదిద్దుతాం.

తప్పక గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను ఆహ్వానించిన‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం.

100కు పైగా దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరవుతారు.

2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం.

నెట్-జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ ఉండబోతుంది.

ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం.

సింగపూర్‌కు చెందిన కంపెనీ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోంది.

ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నాం.

ఫ్యూచర్ సిటీలో అమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయని అన్నారు. .
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!