ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లితాడిచెర్ల ఫేజ్-2 సింగరేణికి కేటాయింపు స్వాగతం మంథనిలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన...

తాడిచెర్ల ఫేజ్-2 సింగరేణికి కేటాయింపు స్వాగతం మంథనిలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ శ్రేణులు

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 08:
మంథని నియోజకవర్గంలోని తాడిచెర్ల ఫేజ్-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడాన్ని స్వాగతిస్తూ బుధవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం చొరవతో ఈ కేటాయింపు సాధ్యమైందని పేర్కొంటూ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు బోగోజు శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి మాట్లాడుతూ వేలం ప్రక్రియ లేకుండానే తాడిచెర్ల ఫేజ్-2 బొగ్గు బ్లాక్‌ను నేరుగా సింగరేణికి కేటాయించడం కేంద్ర ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సింగరేణి సంస్థ బలోపేతం కావడంతో పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది పడిందన్నారు.
ఈ బొగ్గు బ్లాక్‌లో సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని తెలిపారు. 40 నుంచి 50 సంవత్సరాల పాటు గని కార్యకలాపాలు కొనసాగడంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా రూ.64 వేల కోట్లకు పైగా ఆదాయ సృష్టి జరిగే అవకాశముందని, వేలం నిర్వహించకపోవడం వల్ల రూ.2,550 కోట్ల ఆక్షన్ ప్రీమియం ఆదా అయిందని, తెలంగాణ ప్రభుత్వానికి సుమారు రూ.16 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని నాయకులు వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి మంథని ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, రానున్న ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో బీజేపీ విజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో-కన్వీనర్ నాంపల్లి రమేష్, సీనియర్ నాయకుడు నారమల్ల కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, దాసరి శ్రవణ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు రేపాక శంకర్, పట్టణ కార్యదర్శి పార్వతి విష్ణు, కోశాధికారి ఒడ్నాల శ్రీనివాస్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షరీఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!