ePaper
Sunday, October 18, 2026
ePaper
Homeజాతియంరాష్ట్ర గీతమే ఫస్ట్: మద్రాస్ హైకోర్టు

రాష్ట్ర గీతమే ఫస్ట్: మద్రాస్ హైకోర్టు

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:                                                                                                                         తమిళనాడులో ప్రభుత్వ కార్యక్రమాలలో మొదటగా రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ను ఆలపించాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల కేంద్ర హోం శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో వందేమాతరం ముందు పాడాలని ఎక్కడా పేర్కొనలేదని, రాష్ట్ర గీతాన్ని చివరి స్థానానికి నెట్టేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. చెన్నైకి చెందిన అనన్య రాధాకృష్ణన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ స్పష్టత వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలను తమిళ గీతంతో ప్రారంభించి, జాతీయ గీతంతో ముగించడం తమిళనాడులో చాలాకాలంగా వస్తున్న సంప్రదాయమని పిటిషనర్ వాదించారు. అయితే, ఇరుపక్షాల వాదనలు అనంతరం పిటిషన్‌పై హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
===================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!