భీమారంలో ఘనంగా 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు:
భీమారం (మంచిర్యాల), అర్జున్ సమాచారం, ఆగస్టు 19:
187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జైపూర్ మరియు భీమారం మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భీమారం మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను బుదవారం నాడు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యురే చిత్రపటానికి నాయకులు, సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధికారిక పతాకాన్ని ఆవిష్కరించారు. సమాజంలో జరిగే సంఘటనలను, శుభకార్యాలను మరియు జ్ఞాపకాలను పదిలపరిచే ఫోటోగ్రాఫర్ల సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జైపూర్-భీమారం మండల యూనియన్ అధ్యక్షులు కొరకొప్పుల కిషోర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వెన్న గణేష్, కోశాధికారి మండల ప్రణీత్ పాల్గొనగా, సంఘం సభ్యులు తిప్పర్తి రమేష్, పెండ్రి శ్రీనివాస్, ధారవేణి తిరుపతి, కోట్రంగి రవీందర్, కోట విష్ణు, చిలకాని సాయి, కోట మహేందర్, సిడెం ప్రకాష్, సెగ్యం రాజుకుమార్ మరియు పలువురు ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు

