టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 2వ రోజు మహా అన్న దానం.
మంచిర్యాల:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 16.
ఈ రోజు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్ లో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీమతి శ్రీ MD హబీబ్ హుస్సేన్ గారి పుణ్య దంపతుల గార్లచే 2 వ రోజు మహా అన్న దానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కాలనీ నస్పూర్ లో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 2వ రోజు మహా అన్నదానం చేసిన శ్రీమతి శ్రీ MD హబీబ్ హుస్సేన్ గారి పుణ్య దంపతులకు శ్రీ సిద్ధి వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలపడం జరిగినది. టీఎన్జీవో హౌసింగ్ కాలనీ శ్రీ సిద్ధి వినాయక మండలి లో నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు మధ్యాహ్నం మహా అన్నదానం మరియు సాయంత్రం అల్పాహారం దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపడం జరిగినది.తదుపరి టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో మహా అన్నదానం చేసిన శ్రీమతి శ్రీ శ్రీమతి MD హబీబ్ హుస్సేన్ గారి పుణ్య దంపతులకు సన్మానం మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 10 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ రాచకొండ గోపాల్ రావు గారిని మరియు 11వ డివిజన్ కార్పొరేటర్ల శ్రీ సుదమల్ల హరికృష్ణ గారిని మరియు R&B SE శ్రీ కె రాము గారిని DE CH. రమేష్ గార్లను ఘనంగా సన్మానం చేయడం జరిగినది. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో టీఎన్జీవోస్ హౌసింగ్ సొసైటీ కార్యనిర్వాహక అధ్యక్ష కార్యదర్శులు గుండేటి యోగేశ్వర్ గారు మరియు కస్తూరి నాగేశ్వర్ సైoడ్ల మొండయ్య గారు గారు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నాయకులు పుప్పాల హనుమంత రావు గారు పొన్న మల్లయ్య గారు శ్రీపతి బాపురావు గారు బొడ్డు శ్రావణ్ కుమార్ గారు భూముల రామ్మోహన్ గారు తిరుపతి రెడ్డి గారు సునీత గారు ఎన్. సత్యనారాయణ గారు టి.తిరుపతి గారు బెక్కం ఉషన్నగారు టీఎన్జీవో కాలనీ నాయకులు,మహిళలు పాల్గొన్నారు.

