మోదీ పాలన ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణం.
రక్తదానం గొప్ప మానవతా సేవ: బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
చెన్నూరు (అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 26): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలోని మహేశ్వరి భవన్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ గారి పరిపాలన ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ప్రధానమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం చేయడం గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడగలదని పేర్కొన్నారు.
ఆరోగ్యవంతమైన యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిస్తూ “రక్తదానం చేద్దాం.. ప్రాణాలను కాపాడుదాం.. మానవత్వాన్ని చాటుదాం” అని అన్నారు. మంచిర్యాల జిల్లాలోని తలసేమియా బాధితులకు ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా సుదీర్ఘకాలం దేశానికి సేవలందించారని, ఆయన 76వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహించడం బీజేపీ కార్యకర్తలకు గర్వకారణమని వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, కార్యక్రమ ఇన్‌చార్జి పట్టి వెంకటకృష్ణ, జిల్లా కార్యదర్శి వైద్య శ్రీధర్, మంత్రి సురేఖ రామయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శివకృష్ణ, కౌన్సిలర్ గర్రెపల్లి శాంత వెంకట నరసయ్య, సీనియర్ బీజేపీ నాయకులు రాపర్తి వెంకటేశ్వర్, జాడి తిరుపతి, పొన్నం లక్ష్మాగౌడ్, చెన్నూరు పట్టణ ప్రధాన కార్యదర్శి కాగిత వెంకటేష్, చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాల అధ్యక్షులు బుర్ర రాజశేఖర్, పెద్దింటి పున్నం చంద్, ఏట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

