ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణఅక్రమ పట్టాల రద్దు వరకే అధికారుల పరిమితంఅక్రమ పట్టాదారులపై చర్యలకు వెనకడుగుమంథని డివిజన్ దళిత సేన...

అక్రమ పట్టాల రద్దు వరకే అధికారుల పరిమితంఅక్రమ పట్టాదారులపై చర్యలకు వెనకడుగుమంథని డివిజన్ దళిత సేన అధ్యక్షుడు ఊట్ల శ్రీను.

📰 Generate e-Paper Clip

అక్రమ పట్టాల రద్దు వరకే అధికారుల పరిమితంఅక్రమ పట్టాదారులపై చర్యలకు వెనకడుగు
మంథని డివిజన్ దళిత సేన అధ్యక్షుడు ఊట్ల శ్రీను.

అర్జున్ సమాచారం. ఆగస్టు.11/ముత్తారం. రిపోర్టర్

అక్రమ పట్టాలు రద్దు చేయడం వరకే అధికారులు పరిమితమయ్యారని అక్రమంగా పట్టాలు చేసుకుని ప్రభుత్వ నుండి రాయితీలు పొందిన వారిపై చర్యలకు అధికారులు వెనకడుగు వేస్తున్నారని పేదవాడు తప్పు చేస్తే జైల్లో వేస్తారు ధనమున్నవాడు దోచుకుంటే మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేదవాడికి ఒక న్యాయం; ఉన్నోడికి ఇంకో న్యాయమా అని మంథని డివిజన్ దళిత సేన అధ్యక్షుడు ఊట్ల శ్రీను అన్నారు
మంగళవారం రోజున పోతారం గ్రామంలో మంథని డివిజన్ దళిత సేన అధ్యక్షుడు ఊట్ల శ్రీను విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముత్తారం మండలం లోని పోతారంలో 59 సర్వే నెంబర్లు 113 సర్వే నెంబర్లు లలో అక్రమ పట్టాలు తొలగించి అక్రమార్కులపై కేసు నమోదు చేయాలని మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేస్తూ అలుపెరగని పోరాటం చేయడంతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అక్రమ పట్టాలను తొలగించి కేసులు నమోదు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు అక్రమ పట్టాలు చేయించుకొని ప్రభుత్వాలను ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించి ఆ పట్టాల పైన బ్యాంకుల నుండి రుణాలు పొంది ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకొని దాచుకున్న వారిపై ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు స్వయంగా కలెక్టర్ శ్రీ హర్ష అక్రమ పట్టాలను రద్దుచేసి 40 రోజులు కడుతున్న అక్రమార్కులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు అక్రమ పట్టాలను తొలగించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన అధికారులు ఇప్పటికీ 40 రోజులు గడుస్తున్నా అక్రమ పట్టాదారులపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని అన్నారు ఏలాంటి రికవరీ చేయలేదని ఇలాంటి వాళ్లకు శిక్ష పడాలి లేనిపక్షంలో పెద్ద ఎత్తున పేదల పక్షాన నిలబడి అక్రమ పట్టాదారులపై శిక్ష పడే అంతవరకు పోరాటం ఆపేది లేదని ఊట్ల శ్రీను తెలిపారు ఏం .

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!