విద్యతోనే జీవితాల్లో వెలుగు.గ్రామీణ విద్యార్థులకు మెరుగైన వసతులుకల్పించడమే లక్ష్యం: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ.
అర్జున్ సమాచారం. ఆగస్టు 19. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
చెన్నూరు, ఆగస్టు 19:చెన్నూరు మండలం కృష్ణంపేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.1.45 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడంతో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తును రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కళాశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోరుబావి ఏర్పాటు చేయించినందుకు మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల పరిస్థితి సరిగా లేదని తెలుసుకున్న వెంటనే మంత్రి స్పందించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. కళాశాల రూపురేఖలు మారేలా సహకరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణలకు ధన్యవాదాలు తెలిపారు.
విద్యకు తొలి ప్రాధాన్యత: మంత్రి వివేక్
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ముందుంటుందని అన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
విద్యతోనే జీవితాల్లో మార్పు: ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విద్యతోనే జీవితాలను మెరుగుపరుచుకోవచ్చని, విద్యార్థులకు నాణ్యమైన విద్యా వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

